అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలు రీఓపెన్ కానియోద్దని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన పిజిఆర్యస్కు 16 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వెంకటరమణ, ఆర్వో స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

