NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ..

1 min read

కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 112 ఫిర్యాదులు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో  కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్  ఐపియస్  సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …1)   కస్టమర్ సర్వీస్ పాయింట్ , ఫ్లాట్ బుకింగ్ ల పేరుతో  విజయవాడకు చెందిన ఏజెంట్ సతీష్ రెడ్డి నా క్రెడిట్ కార్డును వినియోగించి రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కర్నూల్, గణేష్ నగర్ చెందిన వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు.2) నేను సోలార్ పంపుసెట్ల వ్యాపారం చేస్తున్నాను. ఆదోని కి చెందిన ఒక యూట్యూబ్ ఛానల్ విలేఖరి నన్ను బెదిరించి,  నేను మాట్లాడిన మాటలను ఆసరాగా చేసుకుని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆదోని, పంజరపోల్ కు చెందిన హనుమంతప్ప ఫిర్యాదు చేశారు.3) కల్లూరు మండలం, గోకులపాడు గ్రామానికి చెందిన హోంగార్డు పుష్పగిరి నాకు హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ . 5 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు,  చిదంబరావు స్ట్రీట్ కు చెందిన అశోకమ్మ  ఫిర్యాదు చేశారు.బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదిస్తే ఔట్సోర్సింగ్ ఉద్యోగిని తీసివేశామని , నా డబ్బులు నాకు ఇప్పించి న్యాయం చేయాలని కర్నూలు, చంద్రశేఖర్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి ఆశీర్వాదం ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, సిఐలు శివ శంకర్, రామయ్య నాయుడు, శ్రీనివాస నాయక్  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *