NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్తదానంతో అంబేద్కర్‌కు ఘన నివాళి : సాయి ప్రసాద్ వాల్మీకి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాల్మీకి సంఘం యువ నాయకులు సాయి ప్రసాద్ వాల్మీకి రక్తదానం చేశారు. అంబేద్కర్  స్ఫూర్తితో గత ఐదు సంవత్సరాలుగా వరుసగా జయంతి రోజున రక్తదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సాయి ప్రసాద్ వాల్మీకి మాట్లాడుతూ అంబేద్కర్  నేటి యువతకు ఆదర్శమూర్తి అని, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అని అన్నారు. అంబేద్కర్  లేకపోయి ఉంటే దేశంలో నిరక్షరాస్యత, అంటరానితనం ఇంకా కొనసాగేవని ఆయన అభిప్రాయపడ్డారు.అంబేద్కర్  జీవితంలో అనేక ప్రేరణాత్మక ఘట్టాలు ఉన్నాయని, చిన్ననాటి నుంచే వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ విద్యతోనే ఎదిగి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో సమాన హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  రమాకాంత్, శ్రీనివాస ఆచారి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *