NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వర్సిటీలో ఆవిష్కరన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన జయంతి సందర్బంగా ఆవిష్కరించడం తనకెంతో సంతోషాన్నిస్తోందని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు హర్షంవ్యక్తంచేశారు. వర్సిటీ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన 10 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వర్సిటీ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించి పూలమాలతో నివాళులర్పించారు. గతసంవత్సరం ఇదేరోజు శంకుస్థాపన చేసినప్పటినుండి విగ్రహావిష్కరణవరకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.అంబేద్కర్ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడమే ఆయనకు సమర్పిచే నివాళి అని వర్సటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి కొనియాడారు. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని దేశాన్ని పురోగతిలోకి నడిపించే శక్తి అని ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ నివాళులర్పించారు. వర్సిటీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు దాదాపు 10 సంవత్సరాలుగా జరిగిన కృషిని విగ్రహ కమిటీ ఛైర్మన్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి వివరించారు. అనంతరం విగ్రహకమిటీ ఛైర్మన్ మరియు సభ్యులను వి.సి సత్కరించారు. ఈ కార్యక్రమంలో IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్యామలా సరోజిని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.  వెంకటేశ్వర్లుతోపాటు, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు డాక్టర్ బాబాసాహెబ్ స్మృతికి నివాళులర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *