జనగణన 2027లో స్వీయ నమోదు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
1 min read
ఆన్లైన్లో సులభంగా జనగణన నమోదు – కలెక్టర్ పిలుపు
Self Enumeration ద్వారా ఇంటి వద్దే జనగణన పూర్తి
ఖచ్చితమైన డేటాతో సంక్షేమ పథకాల అమలు సాధ్యం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ (Self Enumeration) విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ముందుగా పోర్టల్లో నమోదు చేసుకుని, మొబైల్ నంబర్ ద్వారా OTP ధృవీకరణ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్య, ఉపాధి వంటి అంశాలను సరిగా నమోదు చేయాలన్నారు. జనగణన ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలుకు అవసరమైన ఖచ్చితమైన డేటా లభిస్తుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

