అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్షినికుడు డా:బి.ఆర్ అంబేద్కర్
1 min read

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె అభిషేక్ గౌడ్
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా.బి.ఆర్ అంబేద్కర్ అని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, జేసీ అభిషేక్ గౌడ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యంగంలో మనందరికీ కల్పించిన హక్కులేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్య ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అంబేద్కర్ జీవితం ఒక ఉదాహరణనన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని రచించే అవకాశాన్ని విద్యద్వారా ఆయన దక్కించుకున్నారన్నారు.ఈ సందర్భంగా ఎస్సి కార్పొరేషన్, డిఆర్డిఏ ద్వారా మహిళలకు 13. 64 కోట్ల రూపాయల రుణాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , జేసీ అభిషేక్ గౌడ లు అందించారు.

