44వ డివిజన్ లో డా:బి.ఆర్ అంబేద్కర్ జయంతి
1 min read

కార్పోరేటర్ పొలిమేర దాసు ఆధ్వర్యంలో వృధ్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరై పంపిణి చేసిన ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని స్థానిక 44 వ డివిజన్ గన్ బజార్ వద్ద కార్పోరేటర్ పొలిమేర దాసు ఆధ్వర్యంలో వృధ్ధులకు చీరలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. పవిత్రమైన రోజున 44 వ డివిజన్ లో చీరలు పంపిణీ కార్యక్రమం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కార్పోరేటర్ పొలిమేర దాసును ప్రత్యేకంగా అభినందించారు. దాసు నిరంతరం ఏదో విధంగా డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారని, ఆ భగవంతుడు దివ్య ఆశీస్సులు నిరంతరం అతనిపై ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ కి నివాళులు అర్పించారు.

