NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది నిమిషాల్లో దైవసన్నిదికి..  అంతలోనే  పరలోకాలకు

1 min read

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బొలేరో వాహనం సిమెంట్ ట్యాంకర్ ను ఢీకొని 8 మంది భక్తులు మృతి

మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, మూడేళ్ల చిన్నారి

మరో 13 మంది కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

మృతులు కర్నాటక చిక్ మంగళూరు వాసులు

పోలీసుల అదుపులో ట్యాంకర్ డ్రైవర్

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ భార్గవి

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు :   పది నిమిషాలు ఉంటే దైవ సన్నిధీకి చేరుకుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారు. అంతలోనే పరలోకాలకు చేరారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. అయితే ఈ భక్తుల  పాలిట శాపంగా మృత్యువు నిద్ర రూపంలో కబళించింది. నిద్ర చేసిన తప్పు కు జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది భక్తులు బలయ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు తెలిపిన వివరాల ప్రకారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కర్నాటక లోని చిక్ మంగళూరు జిల్లా సమీప గ్రామాలు ఉదేవ, కణాయకన హళ్లి మిగత గ్రామాల నుండి  KA 46 – 9745 అనే బొలెరో గూడ్స్ వాహనంలో సుమారు 21 మంది తో కలిసి బయలుదేరారు. అయితే గురువారం మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో రాగానే తెల్లవారుజామున మంత్రాలయం వైపు నుంచి సిమెంట్ లోడ్ ట్యాంకర్ KA 32 AC1117 వాహనం  బొలేరో వాహనం వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే  5 మంది మృతి చెందగా 16 మందికి తీవ్ర గాయాలు కావడం విషయం తెలుసుకున్న మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు, ఎస్ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతు  ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో 8 మంది భక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారి లో కుమార్ (50),దీపిక వీణా (45),5 ఏళ్ల కూతురు బెల్లి, సునీల్ (40),యశోద (60),పుట్టమ్మ (50),లోలాక్షి, మీనాక్షి, 9 మంది కి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు తరలించారు. అందులో 4 గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరి ని కూడా కర్నూలు కు తరలించినట్లు సిఐ దస్తగిరి బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,  మంత్రాలయం సిఐ దస్తగిరి బాబు  విచారణ చేస్తున్నారు. సిమెంటు ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేరుకుని పరిశీలించారు. బొలేరో వాహనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ వాహనం కు ఇన్సూరెన్స్ లేదని దీనికి తోడు కండీషన్ లోలేదని ఆర్టిఓ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బొలేరో చిలకలడోన దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరగడం తో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *