NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళల పై నేరాల నివారణ కు అవగాహన కార్యక్రమం..

1 min read

కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్

మహిళల పై నేరాల నివారణ

కల్పించేందుకు ఈ అవగాహన ర్యాలీ చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు .

కర్నూలు, న్యూస్​ నేడు:  మహిళల రక్షణ  కోసం పోలీస్ ఎల్లవేళల … సమస్యల విషయం లో సంకోచం  లేకుండా ఫిర్యాదు కి ముందుకు రండి…జిల్లా ఎస్.పి. విక్రాంత్ పాటిల్. మహిళల రక్షణ కోసం  పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుంది అని సమస్యల విషయం లో   ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ మహిళలకు పిలుపు నిచ్చారు.   మహిళల భద్రత కోసం “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో గురువారం కర్నూల్ మెడికల్ కాలేజీ అందలి గ్యాలరీలో మెడికల్ కాలేజ్ మరియు విద్యార్థులకు మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ   మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళల రక్షణ చట్టాల గురించి  సమాజంలో అవగాహన పెరిగితే నేరాల శాతం తగ్గుతుందని, ఎస్పీ గారు పేర్కొన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సహాయం కోసం 112, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు  అందరూ సహకరించాలన్నారు.మహిళల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళలతోపాటు యువకులకు కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.నేరాలు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మహిళా పీఎస్  డీఎస్పీ ఉపేంద్ర బాబు, వైస్ ప్రిన్సిపల్ లు డా. శ్రీరాములు, డా. సింధియా శుభప్రద,  జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డా. మాధవి శ్యామల ఐసిడిఎస్ నుండి అనురాధ, అడ్వకేట్ నాగలక్ష్మి, సిఐ లు మధుసూదన్ రావు,రామయ్య నాయుడు, శేషయ్య, శివశంకర్ , విక్రమ సింహ , మహిళా శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *