ఘనంగా కర్నూలు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమం..
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: ఈరోజు కర్నూలు నగరంలోని మౌర్య ఇన్‌లో శ్రీ ఆర్య కన్వెన్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షురాలిగా సయ్యద్ షాహీన్ మరియు జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సయ్యద్ బాష , మాజీ ఎంపీ శ్రీ టీజీ వెంకటేష్ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షురాలు సయ్యద్ షాహీన్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి , మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధిక్ , మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు హుస్సేన్ మియా ,మైనారిటీ మోర్చా జోనల్ ఇంచార్జ్ హలవిన్ బాబు మరియు కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

