విభిన్న ప్రతిభావంతులకు అన్ని సౌకర్యాలు కల్పించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
1 min read

ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు, గురువారం ఏలూరు పరిధిలోని విన్సెంటు డిపౌల్ విభిన్న ప్రతిభావంతులు గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ వసతి గృహంలోని సభ్యులకు యాజమాన్యం అందిస్తున్న సౌకర్యాలు, ఆహార పదార్థాలు నాణ్యత వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల్లో పొందటంలో అవసరమైన వారికి న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తామని తెలియజేయడం జరిగిందని, కొంత మంది సభ్యులకు ఆధారు కార్డు లేకపోవడం వల్ల విభిన్న ప్రతిభావంతులకు అందించే సంక్షేమ పథకాలను పొందటంలో జాప్యం జరగడాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆధారు కార్డులు అలాగే సంక్షేమ పథకాలును అప్లై చేయడానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఒక పారా లీగల్ వాలంటీరును ఏర్పాటు చేయడం జరుగుతుందని, అర్హులు అందరికీ న్యాయసహాయం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది, విభిన్న ప్రతిభావంతులు, తదితరులు పాల్గొన్నారు.

