జి. పుల్లయ్య, నిర్మాణ్ (ఎన్జీవో) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం
1 min read

కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు : కర్నూలులోని జి.పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ ఆర్గనైజేషన్ మధ్య విద్యార్థుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ శ్రీ జీవీఎం మోహన్ కుమార్ గారు మరియు హరీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ నిర్మాణార్గనైజేషన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు, మార్చుకున్న అనంతరం వారిరువురూ ఈ భాగస్వామ్య ముఖ్యాంశాలు తెలియజేశారు. ఇంపాక్ట్ హైరింగ్ కార్యక్రమాలు: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్లేస్మెంట్ అవకాశాలను నిర్మాణ్ పారిశ్రామిక నెట్వర్క్ ద్వారా కల్పించడం. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, రెజ్యూమె తయారీ, ఇంటర్వ్యూ శిక్షణ అందించడం. నిర్మాణ్ స్టూడెంట్ చాప్టర్ ఏర్పాటు: GPCETలో నిర్మాణ్ స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించి, వర్క్‌షాప్‌లు, సామాజిక ప్రభావ ప్రాజెక్టులు, నాయకత్వ శిక్షణ ద్వారా విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడం. కళాశాల తరఫున ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ను నియమించడం. నైపుణ్యాభివృద్ధి & సామర్థ్య పెంపు: సాంకేతిక, సాంకేతికేతర నైపుణ్యాలపై ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, పరిశ్రమ నిపుణులతో గెస్ట్ లెక్చర్లు, మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహించడం. అవుట్ రీచ్ & సమ్మిళిత అభివృద్ధి: మహిళా సాధికారత, లింగ సమానత్వం, సమాన అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం వంటివి చేపడతారని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ విభాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

