పెదపాడు శాఖ గ్రంథాలయంలో స్వచ్ఛ-ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం
1 min read

రిసోర్స్ పర్సన్ పూడి. రవికుమార్ చే విద్యార్థినీ, విద్యార్థులకు నీటి సంరక్షణ పై అవగాహన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంథాలయం నందు నేడు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రంధాలయ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి, గ్రంథాలయంలోని రెక్స్ లో ఉన్న పుస్తకాలు శుభ్రపరిచి, బూజులు దులపడం జరిగినది. మరియు విద్యార్థిని, విద్యార్థులు, పాఠకులతో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించడమైనది. విద్యార్థిని విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ చే నీటి సంరక్షణ పై అవగాహన కల్పించడం జరిగినది. మరియు జలం-జీవం అంశంపై విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు,సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొనిన విద్యార్థిని, విద్యార్థులకు స్నాక్స్ పంచ్ పెట్టడం జరిగిందని గ్రంథాలయా ధికారి దుగ్గిపోగు జాన్ బాబు తెలియజేసినారు.


