రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి ఆర్థిక సాయం
1 min read

సహాయం అందజేసిన డా:షేక్ సయ్యద్ బాజీ (గాజులబాజీ)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నూర్ భాషా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన అశోక్ నగర్ వాసి, లారీ డ్రైవర్‌కు అండగా నిలిచి, వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నడవడానికి ఆసరాగా ఒక స్టాండ్‌ను అందజేశారు.బాజీ ఈ సేవా కార్యక్రమం మనందరికీ ఆదర్శనీయమని ప్రేమించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

