NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిజాయితీ నిస్వార్థం గల యువ నాయకుడు

1 min read

దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెల్లడి

ఏలూరు ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆబ్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు,ఎమ్మెల్యేలు బడేటి చంటి,సొంగ రోషన్  కుమార్,ధర్మ రాజు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్  ఆదివారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయానికి భారీ  ఊరేగింపుగా జన సందోహం తో   విచ్చేశారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు, దెందులూరు శాసనసభ్యులు  చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రాసిన కుమార్, ఎంపీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి ఇటీవల జరిగిన పరిణామాలపై ఎంపీ కి సంఘీభావం తెలిపారు.వారు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్  అత్యంత నిజాయితీ మరియు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనస్తత్వం కలిగిన యువ నాయకుడని కొనియాడారు. రాజకీయ నాయకుల జీవితాల్లో ఆరోపణలు రావడం సహజం, కానీ మా ఎంపీ పై వచ్చినవి కేవలం ప్రత్యర్థులు పన్నిన కుట్రలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయం అనేది ఒక పద్మవ్యూహం అని, ఈ కుట్రలో ఏ పాపం ఎరుగని మహేష్ చిక్కుకోవడం తమతో పాటు పలు నియోజకవర్గాల  ప్రజలను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.క్లీన్ చిట్ తో వస్తారని ధీమా వ్యక్తం చేస్తూధర్మమే గెలుస్తుందని అన్నారు, పుట్టా మహేష్  ఈ ఆరోపణల నుండి క్లీన్ చిట్ తో బయటకు వస్తారని తమకు పూర్తి నమ్మకం ఉందని ఆశాభావంతో ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ  మరియు తామందరం సమిష్టిగా పనిచేసి, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో ఎంపీ కి నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *