ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత.. నవ్యాంధ్ర నిర్మాత మన సీఎం
1 min read

సారవకోట: టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ
సావరకోట , న్యూన్ నేడు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాముకుడు.. అంతకుమించి విజనరీ ఆయనెప్పుడు భవిష్యత్ గురించే ఆలోచిస్తూనే ఉంటారని సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి వైపు తాను పరిగెడుతూ.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.. 75 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ పెట్టిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ చరిత్ర అంటే 1995కు ముందు.. తర్వాత అన్నట్లు మాట్లాడుకునేలా మార్చేశారు చంద్రబాబు. అప్పటి వరకు హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్బండ్లు మాత్రమే గుర్తొచ్చేవి. అయితే బాబు హయాంలో హైటెక్ సిటీకి ముందు.. హైటెక్ సిటీ తర్వాత… అన్నట్లు హైదరాబాద్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. విజన్ ఉన్న నేతగా ఆయన హయాంలో నిర్మించిన సైబర్ టవర్స్ లేకపోతే ఇప్పటి హైటెక్ సిటీనే లేదు. ఇంకా చెప్పాలంటే అసలు సైబరాబాద్ అనే పేరు కూడా లేదనే చెప్పాలి. చివరికి బద్ధశత్రువులైన కమ్యూనిస్టులు కూడా 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు చేపట్టిన సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నారంటే దటీజ్ విజనరీ అని అన్నారు సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తి’రి వెంకటరమణ.

