NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భరతమాత మందిరం లో మే నెల ఒకటి నుండి సుందరకాండ ప్రవచన సప్తాహం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మే నెల  ఒకటి నుండి ఏడవ తేదీ వరకు కర్నూలు నగరం, నాగిరెడ్డి రెవిన్యూ కాలనీలో  వెలసిన శ్రీ భరతమాత మందిరం నందు ప్రసిద్ధ ఉపన్యాసకులు, మధుర వాచస్పతి గుంటూరు జిల్లా, నంబూరు కాళీవనాశ్రమ ప్రధాన పౌరాణికులు శ్రీనివాస రామానుజ దాసుచే శ్రీమద్రామాయణంలోని సుందరకాండపై ప్రవచన సప్తాహం ఏర్పాటు చేసినట్లు విష్ణు సహస్ర నామ బృందం అద్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ లను  విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి  పి. కోటేశ్వరరావు, లలితా పీఠం పీఠాధిపతులు సుబ్రహ్మణ్యం స్వామి, తి.తి.దే.హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తదితరులతో ఆవిష్కరింప చేశారు. సుందరకాండ పారాయణం, శ్రవణం వలన కష్టాలను అధిగమించే శక్తి, ధైర్యం కలుగుతాయని, ఈనాటి సమాజానికి, ప్రత్యేకించి యువతకు హనుమంతుని కార్యదీక్ష, సీతమ్మ చూపించిన ధైర్యసాహసాలు తెలుసుకోవలసిన అవసరం ఉన్నదని, అందుకే ఈ కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, భరతమాత సేవా సమితి అధ్యక్షులు సందడి మహేశ్వర్, భరతమాత సేవా సమితి కార్యదర్శి అయోధ్య శ్రీనివాసరెడ్డి, కోశాధికారి మల్లెల పెద్ద పుల్లారెడ్డి, సహ కార్యదర్శి  తూముకుంట ప్రతాపరెడ్డి, కార్యవర్గ సభ్యులు శివ శంకర్ రెడ్డి, చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, లావణ్య, అర్చకులు భరద్వాజ్ శర్మ, , శకుంతల, పద్మావతి కాత్యాయనీ, శ్రీలక్ష్మి, విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత జిల్లా ప్రముఖ్ శివకోటి చంద్రశేఖర్, వెల్దుర్తి అభయాంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్త రామాంజనేయులు, బొమ్మిరెడ్డిపల్లి శివాలయం ధర్మకర్త లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *