కృపాకర్ పై కేసునమోదు చేయాలి
1 min read
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు డిమాండ్..
మిడుతూరు(నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో కృపాకర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోతల్లిని జేజిని ఆడపిల్లలను హత్య చేయడానికి కృపాకర్ వెళ్లాడని అన్నారు.కావేటి మరియమ్మను కృపాకర్ మద్యం సేవించి అనేక సార్లు హత్య చేయడానికి ప్రయత్నించడంతో గతంలో స్థానిక మిడుతూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కృపాకర్ లో మార్పు రాలేదన్నారు.ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వకుండా సచివాలయ అధికారులను కృపాకర్ బెదిరిస్తున్నాడని మరియమ్మ మరియు కుటుంబ సభ్యులకు కృపాకర్ నుండి ప్రాణహాని ఉన్నందున కృపాకర్ పై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఐ సుబ్బయ్యకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఓబులేష్,కర్ణ,ఉస్మాన్ భాష మరియు బాధితులు పాల్గొన్నారు.


