NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“తల్లిపాలలోనే ఉంది పిల్లల ఆరోగ్య భవిష్యత్తు” ..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ & కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిందియా శుభప్రద…… పిల్లల ఆరోగ్య భవిష్యత్తు వారి తల్లుల  తల్లిపాలులోనే ఉందని అందుకే ప్రతి మహిళ తమ  పిల్లలకు విధిగా పుట్టినరోజు నుండి కనీసం ఆరు నెలల వరకు తల్లిపాల అందించాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సింధియా శుభప్రద అన్నారు. సోమవారం పర్ల గ్రామంలోని రూరల్ హెల్త్ సెంటర్   ఆధ్వర్యంలో కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్యక్రమంలో అధికారి డాక్టర్ పుష్పలత అధ్యక్షతన అంగన్వాడి సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తల్లిపాలులో అత్యధిక పోషక విలువలు రోగనిరోధక శక్తి, పిల్లల ఆరోగ్య ప్రతిష్టతకు కావలసిన అన్ని కొషకాలు ఉంటాయని ఆమె తెలిపారు. కమ్యూనిటీ మెడిసిన్ ఇంటర్ వైద్య విద్యార్థులు పోస్టర్లతో తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రేణుక, నోడల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రవి నాయ క్ డాక్టర్ వైష్ణవి డాక్టర్ ప్రసన్న రాణి, పీజీ లు డా. శ్రీలక్ష్మి,డా. పూజ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ తస్లీమ్ డాక్టర్ నిరంజన్, లెక్చరర్ సురేష్, హెల్త్ ఎడ్యుకేటర్ షణ్ముఖుడు,  హెల్త్ సూపర్వైజర్లు సాయిరాం, మాధవ రాజు పార్వతమ్మ, ఏఎన్ఎంలు సుభాషిని, భవాని, అంగన్వాడీ టీచర్ అనసూయ ఆయా ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *