NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ సేవలకు గుర్తింపే ఆత్మీయ వీడ్కోలు..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: స్టేట్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదటి సిఎస్ఆర్ఏంవో డా. హేమ నళిని కి ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు…. స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సిఎస్ఆర్ఎమ్ఓ డాక్టర్ హేమనళిని పదవీకాలంలో సేవలు అమోఘమని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. సి.ఎస్.కె ప్రకాష్ అన్నారు. మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ యందు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఏపీజిడిఏ అసోసియేషన్ సంయుక్తంగా సిఎస్ఆర్ ఎం ఓ డాక్టర్ హేమనలిని పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వారు గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయి హాస్పిటల్ లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వివిధ హోదాల్లో పనిచేసిన మంచి అనుభవం  ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెచ్చారని రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ సేవలను పూర్తి చేసుకున్నారని కొనియాడారు. పని విషయంలో నిక్కచ్చిగా ఉంటూ ఎటువంటి ఆరోపణ రాకుండా పదవీ విరమణ తీసుకోవడం గొప్ప విశేషం అన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్ హేమ నళిని మాట్లాడుతూ ప్రభుత్వ సర్వీస్ కాలం చాలా సంతృప్తి ఇచ్చిందని కరోనాలో సమాజానికి వీలైనంత ఎక్కువగా చేయగలిగానని రిటైర్మెంట్ కు ముందు క్యాన్సర్ రోగులకు సేవలు అందించడం చాలా సంతృప్తి ఇచ్చిందని ఇదంతా దైవ కృప అని మన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తే మనకు దైవం కూడా మంచి స్థానాలను అందిస్తుందని తెలిపారు. ఏపీజిడిఏ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ మాట్లాడుతూ డా. హేమనళిని అన్ని రకాల విభాగాల నుంచి ఎంతో అనుభవం గడించి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు, జి జి హెచ్ కు ఉత్తమ సేవలందించారని కొనియాడారు. ఏపీజి డి ఏ సభ్యుల సమస్యల కొరకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సభ్యులందరూ సహకరించాలని కోరారు. అధికారిక కార్యక్రమాల వల్ల  అడిషనల్ డీఎంఈలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ డాక్టర్ వెంకటేశ్వర్లు ముందుగా వచ్చి వ్యక్తిగతంగా అభినందనలు తెలిపి సన్మానంచారు. ఈ  వీడ్కోలు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ శ్రీరాములు, డాక్టర్స్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపర్ ఇండెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి, పెథాలజీ ఆంకాలజీ ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్లు డా. వరలక్షి , డా. ప్రశాంతి, డా. రాజా రవి కుమార్, డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ చైతన్యవాణి, డా. నరేష్, ఏపీ జి డి ఏ కోశాధికారి డా. దమామ్ శ్రీనివాసులు, డా.వెంకటరమణ నర్సింగ్ సూపరిండెంట్, శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author