టిడిఆర్ బాండ్ల జారీ వేగవంతం
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరంలోని కిడ్స్ వరల్డ్ నుండి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ (ఆర్డీపి-2) కు సంబంధించి టిడిఆర్ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక కే.ఎం. హాస్పిటల్ వద్ద విస్తరణ కొలతలు పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు, త్వరలో టిడిఆర్ బాండ్ల జారీ పూర్తి చేస్తామన్నారు. 180 ఆస్తులు ప్రభావితం అవ్వగా, 50 బాధితుల వరకు సమ్మతి పత్రాలు సమర్పించారని, మిగిలిన బాధితులు సైతం వెంటనే పత్రాలు సమర్పిస్తే టిడిఆర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.కార్యక్రమంలో ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, బిల్డింగ్ ఇంస్పెక్టర్ మధుగోపాల్, మాజీ కార్పొరేటర్ కురుబ పరమేష్, ఇంచార్జీ మహేబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

