దళితులపై అగ్రవర్ణాల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి
1 min read
స్వాతంత్రం వచ్చి 70 8 ఏళ్ల అయినా సమాజంలో మాపై వివక్షత చూపిస్తున్నారు
జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన
జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా సమాజం లో దళితులపై అగ్రవర్ణాల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయనిఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,దళితుల రక్షణ కోసంరాజ్యాంగం లో ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని రాజకీయ పార్టీలు వాటిని ఉల్లంఘించి దాడులకు పాల్పడిన వారిని కాపాడుకుంటున్నాయని ఏలూరు జిల్లా ఎమ్ ఆర్ పి ఎస్ అధ్యక్షులు కొత్తపల్లి మురళి మాదిగ అన్నారు,కుక్కునూరులో కాపులు దళిత మాదిగ యువకుడిపై దాడి చేశారని,నవంబర్ 28 వ తేదీన పెదవేగి మండలం కవ్వగుంట గ్రామం లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న నడిపల్లికి చెందిన మాదిగ యువకుడిపై కత్తితో దాడి చేశారని మురళి అన్నారు,ఇటువంటి దాడులకు పాల్పడే వ్యక్తుల పై ఎస్ సి ఎస్ టి ఎట్రాసిటీ కేసులు నమోదు చేసి దళిత మాదిగల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని జిల్లా ఇంచార్జి కూచిపూడి సత్యం మాదిగ సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమం లో బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ,కందుల రమేష్ మాదిగ,కాసి కృష్ణ మాదిగ ,విస్సంపల్లి సిద్దు మాదిగ,సొంగా విజయ మాదిగ,తంగాల శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

