మహిళను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుంది
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జిల్లా తెలుగుడేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు కీ, నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా నాయకురాలతో కలిసి కేక్ ను కట్ చేయగ వారు ఒకరికి ఒకరు పంచుకోవడం జరిగింది.ఈ సంధార్బంగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలకు పెద్దన్న చంద్రన్న, మహిళను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని, స్త్రీ లేకుండా సృష్టి లేదు… స్త్రీ లేకుండా జీవం లేదు… స్త్రీ లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించలేనిదని అన్నారు’ఈ రోజు మనం ఆమె గొప్పతనాన్ని, ఆమె శక్తిని, ఆమె త్యాగాన్ని స్మరించుకుందాం.” అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తుచేసుకునే సందర్భం. మహిళలు సమాజానికి మూలస్థంభాలు. కుటుంబాన్ని నిర్మించడంలోనే కాకుండా దేశ నిర్మాణంలో కూడా మహిళల పాత్ర అత్యంత కీలకం. ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, అన్న నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి ఆత్మగౌరవాన్ని పెంచారు. స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశంపార్టీ.నేటి సమాజంలో మహిళలు ఇంటి నుంచి పార్లమెంట్ వరకు రాణిస్తున్నారు. మన ప్రభుత్వం మహిళల భద్రత, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది.మహిళలను కుటుంబ పరిమితుల్లో మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూడాలనే దూరదృష్టి కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలని వారి రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకుపెంచారు.సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని వారికి రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు.“తల్లికి వందనం” ద్వారా 67 లక్షల మంది తల్లులకు రూ.10 వేల కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి ప్రతి తల్లి కళ్లలో ఆనందాన్ని నింపారు.ఎన్నికల హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పటికే 45 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు.వంటింటి భారాన్ని తగ్గించేందుకు 3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు.పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ 5 వేల మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశారు.ఇంటి కోసం కలలు కనే మహిళలకు ఇప్పటికే 3 లక్షల ఇళ్లు అందించారు. రాబోయే ఉగాదికి మరో లక్ష గృహ ప్రవేశాలు జరగబోతున్నాయి.మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీకి శిక్షణకుప్పంలో విద్యార్థినులకు 5,555 సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు తగ్గాయిపి4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకు రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు లబ్దిమహిళలను గౌరవించాలి, వారి స్వప్నాలకు రెక్కలు కట్టాలి. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతోముందుకు సాగాలని అన్నారు.ఈ రోజు కార్యక్రమంలో జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్, రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ లక్ష్మి, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, కార్పోరేటర్ షేక్ జీకియా అక్సారి, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిఅక్షయ కుమారి, కార్పోరేటర్ కె.వి.పద్మలతా రెడ్డి, మారుతి శర్మ, గొల్ల విజయ లక్ష్మి, మాలిని మొదలగు వారితో పాటు మహిళా నాయకులు పాల్గొన్నారు.

