NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెబ్బటం గ్రామంలో భక్త కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ

1 min read

హోళగుందన్యూస్ నేడు: హెబ్బటం గ్రామంలో భక్త కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. భక్తి భావంతో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి , రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ , అలాగే టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  హాజరై భక్త కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.భక్త కనకదాస్  గొప్ప భక్తుడు, కవి మరియు సామాజిక సంస్కర్తగా పేరుపొందారు. ఆయన భక్తి, సమానత్వం మరియు మానవతా విలువలను సమాజానికి బోధిస్తూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. ఆయన సందేశాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందించేలా ఉన్నాయని అతిథులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని భక్త కనకదాస్ సేవలను స్మరించుకున్నారు.

About Author