చీకట్లో మగ్గుతున్న గ్రామం…
1 min read

మహానంది, న్యూస్ నేడు: మండలంలోని బొల్లవరం గ్రామం గత కొన్ని రోజుల నుంచి చీకట్లో మగ్గుతుంది. వీధిలైట్లు వెలగక గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గ్రామంలోని ప్రధాన త్రాగునీటి ట్యాంకు కు నీటిని సరఫరా చేసే లైను దెబ్బ తినడంతో నీరు వృధా అవుతుంది . నీరు పంపింగ్ అనంతరం అక్కడ నిలిచిపోయిన మురుగు నీరు మరల పైప్ లైన్ లోనికి పోతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిరిగి ఆ మురుగు నీరు పంపిన జరిగినప్పుడు ట్యాంకులోనికి వెళ్లి అక్కడినుండి కుళాయిలకు సరఫరా అవుతుంది అని వాపోతున్నారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే చోట లీకేజీ ఏర్పడిన మరమ్మత్తులు చేపట్టారని కానీ ప్రస్తుతం గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయినా కూడా వీధిలైట్లు, తాగునీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

