శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకం – పడిపూజ మహోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పరమ పవిత్రమైన శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షాధారణ స్వీకరించి, శబరిమల యాత్ర నిమిత్తం నిజామాబాద్ నుండి కాలినడకన ప్రయాణం చేస్తున్న సువర్ణభూమి అయ్యప్ప భక్తులు ఈ రోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలోని దత్త కళాక్షేత్రం నందు శ్రీ అయ్యప్ప స్వామి వారి అభిషేకం మరియు పడిపూజ కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది.ఈ పవిత్ర అభిషేకం మరియు పడిపూజ కార్యక్రమాలను గురుస్వాములు శ్రీ గురు వినయ్ కుమార్ , శ్రీ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో భక్తిపూర్వకంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.ఈ కార్యక్రమానికి ఎం. శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, ఎస్.వి. రమణారెడ్డి వారి కుటుంబ సభ్యులు, టీ. రవిశంకర్ వారి కుటుంబ సభ్యులు అందించిన సహాయ సహకారాలతో పాటు, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ట్రస్టీ సభ్యులు టీ. శివరామకృష్ణ అందించిన సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి, అన్నప్రసాద వితరణకు తోడ్పడిన దాతలందరికీ, గురుస్వాములకు మరియు భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.



