44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలి
1 min read
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి
ఏ ఐ టి యు సి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత శ్రామిక వర్గం 100 సంవత్సరాల పైబడి పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని ఏ ఐ టి యు సి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ ఐ టి యు సి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దేశంలో మార్పు రావాలి– మార్పు కోరాలి అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఏలూరు అర్బన్ తహసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నాడు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు అధ్యక్షత వహించారు. డిప్యూటీ తాసిల్దార్ గాయత్రి కి ఎ ఐ టి యు సి మరియు సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ డాంగే, మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ లను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతన బోర్డును పునరుద్దించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను అరికట్టాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, 12వ పిఆర్సి కమిషన్ ప్రకటించాలని, ఐ ఆర్ 30 శాతం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, కార్మికుల హక్కులను హరించి వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తమ విధానాలు విడ నాడాలని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మరియు సిపిఐ నాయకులు డి లక్ష్మణ మూర్తి, బి నారాయణరావు, ఎస్ శ్రీనివాస్, కంటపరెడ్డి భాస్కరరావు, సిరి స్వర్ణ సోమేశ్వరరావు, పిల్ల నాగేశ్వరరావు, సురకాసుల బాపూజీ, మారిశెట్టి మహేష్, గొన్న బత్తుల శివ, ఘంటసాల దుర్గారావు, అడ్డగర్ల ఇందిరా, ఎం విజయ,జి.స్వాతి, నాగం అచ్యుత్, బుగ్గల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


