NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ఏఎస్ఐ చంద్రశేఖర్, పత్తికొండ సీఐ పై చర్యలు తీసుకోవాలి

1 min read

బి.గిడ్డయ్య….సిపిఐ జిల్లా కార్యదర్శి

పత్తికొండ, న్యూస్​ నేడు : 30వ తేదీ సిపిఐ జిల్లా సమితి సభ్యులు భూపేష్ ప్రజల పనిమీద ఆలూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా,  పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ చంద్రశేఖర్, పత్తికొండలో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై దురుసుగా వ్యవహరించిన పత్తికొండ సిఐ జయన్నలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. శనివారం స్థానిక చదువుల రామయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరుస  పదజాలంతో దురుసుగా ఇష్టానుసారము తిట్టి, ప్రయత్నించి అవమానపరచడం దారుణమని, తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి పత్తికొండ సిఐ జయన్న, ఆలూరు ఏఎస్ఐ చంద్రశేఖర్ పై శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర జిల్లా, పోలీస్ ఉన్నతాధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయి లో  పోలీస్ స్టేషన్ లలో  లో పనిచేస్తున్న కొంతమంది అధికారుల తీరు అందుకు విరుద్ధంగా ఉందని, ప్రజలను, నాయకులను దురుసుగా మాట్లాడటం, తిట్టడం పరిపాటిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల పట్ల పత్తికొండ యుపిఎస్  పోలీస్ స్టేషన్ సి.ఐ.జయన్న  దురుసుగా ప్రవర్తించాడని,ఇలాంటి అధికారులకు పోలీసు మాన్యువల్,ఫ్రెండ్లీ పోలీసింగ్ పట్ల అవగాహన కల్పించాలని, ప్రజల పట్ల దురుసుగా మాట్లాడితే శాఖపరంగా చర్యలు.

About Author