భారతీయ ఇతిహాసాలు వెలుగుదివ్వెలు
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
కర్నూలు, న్యూస్ నేడు: భారతీయ ఇతిహాసాలు వెలుగుదివ్వెలని, మానవ జాతి ఉన్నంతవరకు అవి సమాజం ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే మనిషి గొప్ప వారవుతారు, అనే విషయాలు సమాజానికి నేర్పుతూనే ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బనగానపల్లె మండలం, చెరువు పల్లె గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక సంస్కృతిక కార్యక్రమాలు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా మూడు రోజులు జయదేవానందచే స్వామి ధార్మిక ప్రవచనాలు, నాలుగు రోజులు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ గ్రామీణ బ్యాంకు విశ్రాంత అధికారి మరియు ఆలయ ధర్మకర్త కె. పెద్దమోహన్ రెడ్డి, రామిరెడ్డి, చిన్న ఆదిరెడ్డి, మాజీ సర్పంచులు యం.జయమ్మ, లక్ష్మీ మద్దిలేటి, చిన్న పుల్లారెడ్డి, ఎస్.నగేశ్, హార్మోనిష్ఠు కె.ప్రసాద్, తబలిష్ఠు జె. మహేశ్, మద్దిలేటి, శేఖర్, పెద్ద తిమ్మయ్య, మిద్దె భూపాల్, కె. జయమ్మ, యం. లక్ష్మీదేవి, ఎస్. కాంతమ్మ, కె. లక్ష్మీదేవి, భజన మండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

