ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ పరీక్షా ఫలితాల్లో కేయంసి విద్యార్థుల ప్రతిభ..
1 min read

మెడికల్ పిజి పరీక్షా ఫలితాల్లో ఫీజియాలజీ, కమ్యూనిటీ మెడిషన్, ఫార్మాకాలజి విద్యార్థులకు స్టేట్స్ సెకండ్, థర్డ్ ర్యాంకులు…
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ పరీక్షా ఫలితాల్లో కేయంసి విద్యార్థుల ప్రతిభ.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో కర్నూల్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్, ఫీజియాలజి, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థులు స్టేట్ సెకండ్ అండ్ థర్డ్ ర్యాంకులు సాధించడం పట్ల మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ సదరు విభాగం విద్యార్థులను విభాగాధిపతులను అభినందించారు. తనను కలిసిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సింధియా శుభప్రద, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధారాణి, ఫార్మకాలజి విబాగాధిపతి డాక్టర్ రాజేష్ లను మంచి ఫలితాలు సాధించడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటి విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ లు డాక్టర్ అరుణ, డాక్టర్ రేణుక, డా. డాక్టర్ రవి నాయక్, పుష్పలత, ప్రసన్న రాణి, నాగరాజు, ఫిజియాలజీ విభాగపు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. డా. ఎలిజిబెత్ రాణి, డా. ఉమా మహేశ్వరి, డా లక్ష్మి, డా . తులసి డా. సురేష్ బాబు, డా బాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.. ర్యాంకులు సాధించిన విద్యార్థులు కమ్యూనిటీ మేడిషన్ నుండి కొప్పోలు కీర్తన స్టేట్ సెకండ్ ర్యాంక్ (592 ) థియరీ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఫిజియాలజీ విభాగం నుండి డా. డి.మౌనిక స్టేట్ సెకండ్ ర్యాంక్, డా.పి.యశ్వంత్ స్టేట్ థర్డ్ ర్యాంక్ ఫార్మకాలజీ విభాగం నుండి డా. ఆర్. ధారణి. స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించారు.. ఫిజియాలజీ విభాగంలో 0.3% తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో రెండు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు మిస్ అయిందని రాబోవు సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామని అయా విభాగాధిపతులు పేర్కొన్నారు.

