శ్రీ మఠం లో అక్షయ తృతీయ వేడుకలు
1 min read

శ్రీ మఠంలో బృందావనాలకు ఘనంగా చందనోత్సవం
మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో అక్షయ తృతీయ వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రమైన అక్షయ తృతీయ శుభసందర్భంగా, మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో చందనోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గంధము ను ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. ఈ ఊరేగింపులో పవిత్రమైన చందన లేపనాన్ని (గంధాన్ని) అత్యంత భక్తిపూర్వకంగా గర్భగుడిలోకి తీసుకువెళ్లారు. శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆ గంధానికి మంగళహారతి సమర్పించి, పవిత్రమైన ‘గంధలేపన’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం, పవిత్రమైన ఆ చందన లేపనాన్ని శ్రీ మూల బృందావనానికి శాస్త్రోక్తంగా అలిపించి గంధలేపనం చేశారు. దీనిని అనుసరించి, శ్రీ మఠం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ మంచాలమ్మ, శ్రీ ప్రాణదేవరు, శ్రీ రుద్రదేవరు మరియు ఇతర పూజ్య గురువరుల బృందావనాలకు కూడా ఇదే తరహా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాజ ఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్ కే శ్రీనివాస్ రావు, వెంకటేష్ జోషి, శ్రీ పతి ఆచార్, అనంత స్వామి, వ్యాసరాజ్ స్వామి మఠం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


