NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యం

1 min read

నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు కృషిచేస్తున్నాం

మంగళగిరి నా కుటుంబంలా మారిపోయింది

మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినిని అభినందించిన మంత్రి లోకేష్

మంగళగిరి, న్యూస్​ నేడు : అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కులు గురించి మాట్లాడతారు. కానీ బాధ్యతల గురించి ఎవరూ మాట్లాడరు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనకపుట్లమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. మంగళగిరి బీఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది.

నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్: ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు సీఎం తో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్. సీఎం చంద్రబాబునాయుడు , ప్రధాని నరేంద్ర మోదీ  కూడా యువశక్తి గురించి మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి 11వ వార్డులో నివాసం ఉండే విద్యార్థిని తండ్రి రాము పుట్టుకతో దివ్యాంగుడు. ట్రై స్కూటిపై కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిందని, తనకు రూ.6వేల పెన్షన్ వస్తోందని విద్యార్థిని తండ్రి రాము తెలిపారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి తన కుటుంబంలా మారిపోయిందని, మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. విద్యార్థిని శ్రీ కనకపుట్లమ్మ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ ను కలవడం పట్ల విద్యార్థిని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

About Author