NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

1 min read

చాగలమర్రి  న్యూస్​  నేడు :  1983- 1984  వ సంవత్సరం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు   కొన్ని సంవత్సరాల తరువాత సమావేశమయ్యారు. ఆదివారం తాము చదివిన విద్యాలయంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గ్రూపుగా ఫోటోలు దిగారు. ఎన్నో సంవత్సరాలుగా కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విద్యార్థి దశలో తాము పాఠశాలలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ఈ కార్యక్రమానికి పూర్వపు విద్యార్థులు జెట్టి నాగరాజు, బోధనం లక్ష్మయ్య యాదవ్, వల్లం రాము, వంక ద్వారా లక్ష్మణ బాబు, చక్కెరపాని సుబ్బ నరసయ్య, రామచంద్రారెడ్డి, తదితర తోటి విద్యార్థులు పాల్గొన్నారు.

About Author