NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిస్ట్రిక్ట్ 316జె కు  నూతనంగా ఎన్నికయిన గవర్నర్ బృందానికి  ఘనంగా సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికయిన లయన్ విరూపాక్ష రెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా లయన్ ఆర్.వి. రావు మరియు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ లయన్ రవి కృష్ణలను లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ ఫోర్ట్, లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు, లయన్ డాక్టర్ రాహుల్, లయన్ ప్రభాకర్, లయన్ సూర్యనారాయణ బాబు, లయన్ రమణ గౌడ్, లయన్ శ్రీధర్, లయన్ రాయపాటి నాగలక్ష్మి  లు ఘనంగా సత్కరించారు. తాడిపత్రిలో జరిగిన ఈ కన్వెన్షన్‌కు జిల్లా నలుమూలల నుండి లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు, సేవాభావులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అతిథులు మాట్లాడుతూ లయన్స్ సంస్థ మానవ సేవకు అంకితభావంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.నూతన గవర్నర్ బృందం నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, యువత అభివృద్ధి వంటి రంగాలలో విశేష సేవలు అందించాలని సూచించారు.డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ విరూపాక్ష రెడ్డి మాట్లాడుతూ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఆర్.వి. రావు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.డాక్టర్ లయన్ రవి కృష్ణ యువతను సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో ప్రముఖ లయన్స్ నాయకులు అంబటి సుధాకర్ రెడ్డి, లయన్ గోపాలకృష్ణ, లయన్ గౌతమ్,డాక్టర్ బాలమద్దయ్య, మాణిక్యప్రభు, క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సభ్యులు పాల్గొన్నారు.

About Author