NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సావిత్రిబాయి పూలే ..ఫాతిమా షేక్ జయంతి వారోత్సవాలు ముగింపు

1 min read

అనంతపురం లో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల.

ఫాతిమా షేక్ జయంతి జనవరి 9 వ తేదీని ముస్లీమ్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

అనంతపురం, న్యూస్​ నేడు:  చదువుల తల్లులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ ల జయంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. సావిత్రిబాయి పూలే జన్మదినం జనవరి 3 వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలి. భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ ల  జయంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అలాగే జనవరి 3 వ తేదీని సావిత్రి బాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా, ఫాతిమా షేక్ జయంతి జనవరి 9 వ తేదీని ముస్లీమ్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు.  రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ మహిళల హక్కులే మానవ హక్కులని, బాలికలకు శక్తివంతమైన ఆయుధం విద్య ఒక్కటే అని తొలిసారిగా నినదించిన మాతృ మూర్తులు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ లు అని ఆ మహనీయులను నేటి తరం విద్యార్థినులు ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనా విధానంతో భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం మహిళా ఐక్య వేదిక క్యాలెండర్ ను విడుదల చేసి ఉపాధ్యాయులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు మరియు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక టీమ్ తాటికొండ సుంకమ్మ , కురులు పద్మావతి, రమాదేవి , రామాంజనమ్మ ఈబూది కుళ్ళాయమ్మ , వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author