NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 ‘ అంకుర అపెక్స్​’ .. అభివృద్ధి చెందాలి

1 min read

హాస్పిటల్​ ను ప్రారంభించిన ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్​ వెంకటేశ్వర్లు 

కర్నూలు, న్యూస్​ నేడు:శ్రీ సత్య సాయి జయంతి రోజున అంకుర అపెక్స్​ హాస్పిటల్​ ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్​ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.  కర్నూలు పట్టణం గాయత్రి ఎస్టేట్​ లో అంకుర అపెక్స్​  హాస్పిటల్​ ను ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్​ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ వైద్య రంగంలో అంకుర అపెక్స్​ హాస్పిటల్​ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్​ యాజమాన్యం డా. రమణ, డా. మల్లేశ్వరికి ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్​ హబ్​గా పేరుగాంచిన కర్నూలులో కొత్త హాస్పిటల్​ ప్రారంభించడం సంతోషకరమన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ , కర్ణాటక నుంచి వచ్చే పేద రోగులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.  ఆ తరువాత హాస్పిటల్​ యజమానులు డా. రమణ, డా మల్లేశ్వరి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో రోగులకు వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని,  తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  రాయలసీమ ప్రజలు తమను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.   అంతకు ముందు హాస్పిటల్​ లో రోగులకు కల్పించిన సౌకర్యాలు, వసతులను ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, కుడా చైర్మన్​ వెంకటేశ్వర్లు తదితర అతిథులు పరిశీలించారు.

About Author