NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి మంత్రి టీజీ. భరత్  కోటి రూ. విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు లోని డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ మంత్రి వర్యులు టీజీ. భరత్  కోటి రూపాయల విరాళంను ఈనెల 11న ప్రకటించిన విధంగా ఉర్దూ యూనివర్సిటీ బిల్డింగ్ పనుల నిమిత్తం కోటి రూపాయలు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో. షావలి ఖాన్ , రిజిస్ట్రార్. ప్రో. లోకనాథ్  కృతజ్ఞత పూర్వకంగా వారిని కలుసుకోవటం జరిగినది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ షావలి ఖాన్  మరియు రిజిస్ట్రార్ లోకనాథ్  పుస్పగుచం మరియు శాలువాతో ఆయనను సత్కరించారు. అలాగే యూనివర్సిటీ బోధన మరియు బోధనేతర సిబ్బంది కూడా మంత్రి కి కృతఙ్ఞతలు తెలియజేశారు.ఈసందర్భంగా మంత్రి  మాట్లాడుతూ త్వరితగతిన యూనివర్సిటీ పనులు పూర్తి చేయించి త్వరలోనే మీ సొంత బిల్డింగ్ లోనే క్లాసులు జరిగేలా మరియు యూనివర్సిటీ అభివృద్ధికి నావంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాను అని హామీ ఇచ్చారు. జారి చేయు వారు. రిజిస్ట్రార్ డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ. కర్నూలు.

About Author