రెవెన్యూ క్లినిక్ ల ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: రెవెన్యూ క్లినిక్ లు, స్పెషల్ క్యాంప్ ల ద్వారా వచ్చిన అర్జీలను పత్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి డిఆర్ఓ ను ఆదేశించారు.శనివారం ఉదయం రెవెన్యూ సమస్యలు, ఏపీఐఐసి అంశాల పై కలెక్టర్ డిఆర్ఓ, ఆర్డీఓలు, ఏపీఐఐసి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ లు, స్పెషల్ క్యాంప్ ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధించి పురోగతిని డీఆర్వో, ఆర్డీవో లను అడిగి తెలుసుకున్నారు..పత్తికొండ, కర్నూలు ఆర్డీఓ కార్యాలయాలలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు..త్వరలో ఆదోని డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ ను కూడా నిర్వహించి పెండింగ్ లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఆర్ఓ, ఆర్డీవో ల ను ఆదేశించారు.పరిశ్రమలకు సంబంధించి ఎంవోయూ చేసుకున్న పరిశ్రమలన్నిటికి ఫౌండేషన్ స్టోన్ వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ను ఆదేశించారు.టెలికాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఆదోని ఆర్డీఓ అజయ్ కుమార్, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

