NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమంగా వెంచర్లు వేస్తే చర్యలు తప్పవ్

1 min read

అప్రూవల్ తీసుకున్న తర్వాతే ప్లాట్లు వేయాలి

వెంచర్లు..గృహాలను పరిశీలించిన మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పట్టణంలో అక్రమంగా వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.అక్రమంగా వెలుస్తున్న వెంచర్లను మరియు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గృహాలను మున్సిపాలిటీ కమిషనర్ శనివారం పరిశీలించారు.సామాజిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న వెంచర్,ఆర్ఆర్ హోమ్స్,గోల్డెన్ వెంచర్,విఐపి కాలనీ,నంద్యాల రోడ్డులో ఉన్న వెంచర్ మరియు నూతనంగా నిర్మిస్తున్న గృహాలను కమిషనర్ పరిశీలించారు.వెంచర్లకు సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని వెంచర్ల యజమానులను అడిగారు. సరైన పత్రాలు లేకపోవడంతో కంచర్ల యజమానులపై కమిషనర్ సీరియస్ అయ్యారు.ప్రతి బిల్డింగ్ కు అప్రూవల్ తప్పనిసరిగా ఉండాలి.బిపిఎస్ మరియు ఎల్ఆర్ఎస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి లే అవుట్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే వెంచర్లలో ప్లాట్లు వేసుకోవాలన్నారు.అధికారులు నిర్లక్ష్యంతో కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందితో అన్నారు.మున్సిపాలిటీ  అనుమతులు లేకుండా వెంచర్లలో నంబరాళ్లు వేయించడం పనులు చేయించడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణాలు మరియు వెంచర్లు వేస్తే మున్సిపాలిటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్లానింగ్ అధికారి రంగస్వామి,పట్టణ సచివాలయ వార్డు ప్లానర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author