ఘనంగా ఆపస్ ఆవిర్భావ దినోత్సవం
1 min read
“ఒంగోలు , న్యూస్ నేడు : దేశ హితం కోసం విద్య, విద్య హితం కోసంఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ హితం కోసం సమాజం” అనే ధ్యేయ వ్యాఖ్య స్ఫూర్తితో పని చేస్తూ జాతీయ భావాల ప్రాతిపదికగా ఉపాధ్యాయుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, విద్యార్థులలో దేశభక్తి, జాతీయ సమైక్యత, ఆత్మవిశ్వాసం పెంపొందింప చేస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం 1982 ఫిబ్రవరి రెండవ తేదీన ఆవిర్భవించిందని ఆపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం 45వ ఆవిర్భావ దినోత్సవం ఒంగోలు లోని ఆ సంఘ కార్యాలయంలో ఆపస్ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ 1984లో రిజిస్టర్ కాబడి 2004వ సంవత్సరంలో ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ఉపాధ్యాయ సంక్షేమం కోసం చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ నందు శాశ్వత సభ్యత్వం, వైద్యశాఖ స్టీరింగ్ కమిటీ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యత్వం పొంది మరింత బాధ్యతాయుతంగా నూతన ఉత్సాహంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ముందుకుసాగుతున్నదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే మల్లికార్జునరావు దిలీప్ చక్రవర్తి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్ హిమజ జిల్లా బాధ్యులు గుణ ప్రసాద్ నరసింహారావు పి. రవి శంకర్ శేషారావు మార్కండేయులు ఆనంద్ చంద్రశేఖర్ ఫణీంద్ర కుమార్ వై వెంకటేశ్వర్లు పెద్దలు వై వెంకట్రావు నాగ కుమార్ శర్మ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


