NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శివరాత్రి  కి వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడాలి

1 min read

యనమలకుదురు, న్యూస్ నేడు  : రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా, శివరాత్రి పర్వదినాన, ప్రభలు ఊరేగింపు, వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు, ఎక్కడ అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకొనుటకు, త్రాగునీరు, యనమలకుదురు రోడ్డులను పరిశీలించి రోడ్ల మరమ్మత్తులు, వాటర్ పైపులైన్ మరమ్మతులు, అలాగే విద్యుత్ అధికారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్  మునిసిపల్ కమిషనర్, పోలీస్ యంత్రాంగం,మున్సిపల్ యంత్రాంగం వారితో చర్చలు జరిపి ఎక్కడ అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామా ప్రసాద్ , క్లస్టర్ ఇంచార్జ్ అనంతనేని ఆజాద్, సుంకర చినబాబు, తమ్ము అశోక చక్రవర్తి, బెజవాడ వెంకటేష్, చిరావూరి శేషు, తాడిశెట్టి ప్రసాద్, సబ్జా ఏడుకొండలు, భరద్వాజ్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

About Author