హాస్టల్లో భోజనం బాగానే పెడుతున్నారా…
1 min read

విద్యార్థులతో మాట్లాడిన మున్సిపాలిటీ కమిషనర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మీకు హాస్టల్లో భోజనం బాగానే ఉంటుందా ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి హాస్టల్ విద్యార్థులను అడిగారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బిసి హాస్టల్ వసతి గృహాన్ని బుధవారం ఉదయాన్నే ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీరు బాగా చదువుతున్నారా హోంవర్క్ చేస్తున్నారా స్టడీ అవర్స్ మీరు ఎప్పుడెప్పుడు చదువుతారని కమిషనర్ హాస్టల్ విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.హాస్టల్లో ఉన్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.శానిటేషన్ లో భాగంగా పగిడ్యాల రోడ్డు ఆత్మకూరు రోడ్డు పటేల్ సెంటర్ ఓల్డ్ బస్టాండ్ అక్కడ ఉన్న ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజూ చేయాలని శానిటేషన్ కార్యదర్శులను మరియు శానిటేషన్ మేస్త్రీలు లకు కమిషనర్ ఆదేశించారు. కాలనీవాసులను వాటర్ సప్లై శానిటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్ జెఎల్ఎస్ఆర్ మరియు ఓహెచ్ఎస్ఆర్ త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారా అని కాలనీవాసులను కమిషనర్ అడిగారు.పట్టణంలో తాగునీటి సమస్య తలెత్త కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ వెంకట రామిరెడ్డి అన్నారు. తర్వాత ఉదయం అన్న క్యాంటీన్ ను పరిశీలించి అక్కడే కమిషనర్ టిఫిన్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏఈ మనోజ్ రెడ్డి మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

