NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంటల నష్ట అంచనాలకు అనుమతులు ఉన్నాయా.. లేవా..

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  గత 40 రోజుల నుంచి తుఫాను వరదల కారణంగా నష్టం వాటిల్లిన పంటల నష్ట నికి సంబంధించి అంచనాల తయారీకి  అనుమతులు ఉన్నాయా.. లేదా అనేది బయటికి పొక్కడం లేదని సమాచారం. ఇంతవరకు ఎలాంటి అనుమతులు ప్రభుత్వం నుండి రాలేదని తెలుస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ పంటలు తుఫాన్ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పత్తి, మిరప, మొక్కజొన్న, ఇతర మెట్ట పంటలతో పాటు వరి రైతులు కుదేలవుతున్నారు. గత సెప్టెంబర్ నెల నుంచి నేటి వరకు వరుసగా సంభవిస్తున్న తుపానుల, పెనుగాలుల కారణంగా రైతులు అతలాకుతలమవుతున్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా సెప్టెంబర్ మాసంలో తుఫాన్లు సంభవించగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తూ ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం నవంబర్ నెలలో ప్రారంభం కావడంతో వాటి పరంపర తుఫాన్లు బీభత్సం కొనసాగుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుపాన్లు, పెను గాలులు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను అంచనా వేయడానికి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు మిన్న కున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తుఫాన్ల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని దాని మూలంగానే జాప్యత జరుగుతుందని ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడాది కూడా తుఫాను ఈదురుగాలుల వల్ల వరి, అరటి మరియు ఇతర రైతులు తీవ్రంగా దెబ్బ తిన్న ఒక అధికారి వితండవాదంతో క్రింది స్థాయి అధికారుల నివేదికలు పంటలు దెబ్బతిన్నాయని పంపిన కూడా పక్కన పడేసినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి కారణం వర్షపాత నమోదు తక్కువగా ఉందని కారణం చేత అధికారి నివేదిక ప్రభుత్వానికి పంపకుండా పక్కన పడేసినట్టు సమాచారం.

About Author