ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాలి
1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్
సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి
అను హాస్పటల్ సహకారంతో ఉచిత కార్డియాలజీ,యూరాలజీ సేవలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.ఏలూరు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలకు కృషి అందించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అన్నారు.స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చందటమేనని అన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని, పిల్లలు, పెద్దల్లో కూడా ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని కోరారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అను హాస్పిటల్స్ సహకారంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఉచిత కార్డియాలజీ, యూరాలజీ వైద్య సేవలను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలి, ఆరోగ్యంపై అవగాహన ఏర్పరచుకోవాలని కోరారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలకు, ఆసుపత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమౌతుందని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజలను కోరారు.


