NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంటల భీమా పధకం-ఖరీఫ్ 2025 పై అవగాహన

1 min read

రైతులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన

జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి గోడ పత్రికల ఆవిష్కరణ

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : పంటల భీమీ పధకం – ఖరీఫ్ 2025 పై అవగాహన కలిగించే గోడ పత్రికలను గురువారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.  ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినపుడు రైతును ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకాన్ని అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో సార్వా 2025 కి వరి పంటకు గ్రామ యూనిట్ గా మినుములు పంటకు జిల్లా యూనిట్ గా, పత్తి యాసిడ్ లైన్ పంటలకు మండల యూనిట్ గా అమలు చేయడం జరుగుతుందన్నారు.  ఈ పధకంలో పై పంటలు సాగుచేసే అన్ని రకాల రైతులకు అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకులో రుణం పొందే రైతులు, రుణాలు పొందని రైతులు, సొంతభూమి, కౌలుదారులు, రుణ అర్హత గుర్తింపు కార్డుకలిగిన రైతులు అర్హులు.  వరి పంటకు ప్రధాన మంత్రి ఫసర్ భీమా యోజన కింద రూ. 840 రైతు ప్రీమియంగా ఆగస్టు 15వ తేదీ నమోదుకు చివరి తేది అని పేర్కొన్నారు. మినుములు పంటకు పిఎంఎఫ్ బివై స్కీం కింద రూ. 300 రైతు పీమియంగా జూలై 31వ తేదీ ఆఖరి తేదీగా పేర్కొన్నారు.  పత్తి పంటకు ఆర్ డబ్ల్యూ బిసిఐఎస్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ. 1900 రైతు ప్రీమియంగా జూలై 15వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు.నిమ్మ పంటకు ఆర్ డబ్ల్యూ బిసిఐఎస్ ఇన్సూరెన్స్ స్కీం కింద రూ. 2500 రైతు ప్రీమియంగా జూలై 15వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు. ధరఖాస్తు ఫారం పూర్తిచేసి ఆదార్ కార్డు నకలు, బ్యాంకు ఖాతా వివరాలు, మరియు బ్యాంకు పాస్ బుక్ నకలు, కౌలు రైతులు తప్పని సరిగా సిసిఆర్ సి నకలు, రుణం తీసుకొనని సొంత రైతులు తప్పనిసరిగా పట్టాదారు పాస్ బుక్ నకలు, పంట ధృవీకరణ పత్రం, జతపరచవలసివుంటుంది.  రుణం పొందిన రైతులకు బ్యాంకువారు తప్పనిసరిగా ప్రీమియం తగ్గించి రుణం మంజూరు చేయుదురు. రుణం పొందని రైతులు పధకంలో నమోదు చేయడానికి అవసరమైన పత్రాలు తీసుకొని సమీపంలోవున్న కామన్ సర్వీస్ సెంటర్(మీ సేవాకేంద్రం), పోస్టాఫీసు, గామ సచివాలయంలో పంప్రదించి గడువుతేదీలోగా ప్రీమియం నగదు చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు సమీపంలో వున్న బ్యాంకు శాఖ, సంబంధిత వ్యవసాయశాఖ అధికారిని, సంబంధిత భీమా కంపెనీల ప్రతినిధులను సంప్రదించవచ్చు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా,పలువురు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

About Author