NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికోవర్ హాస్పిటల్​ లో  ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవం పై అవగాహన

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు: ప్రపంచ స్ట్రోక్‌ దినోత్సవం సందర్భంగా మెడికోవర్ హాస్పిటల్స్‌, కర్నూల్‌ లో స్ట్రోక్‌ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో న్యూరో మరియు ఎమర్జెన్సీ విభాగ వైద్య నిపుణులు పాల్గొని స్ట్రోక్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించారు.ఈ సందర్భంగా డా. విశ్వ కుమార్ కె.ఎస్‌ (MBBS, MS, MCh) – కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మాట్లాడుతూ,“స్ట్రోక్‌ అనేది మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా రక్తస్రావం జరిగినప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితి. ఈ పరిస్థితిని తక్షణం గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణరక్షణ మాత్రమే కాకుండా పాక్షిక పునరుద్ధరణ కూడా సాధ్యమవుతుంది. ప్రజలు స్ట్రోక్‌ లక్షణాలను గుర్తించడంలో చురుకుగా ఉండాలి,” అని తెలిపారు.డా. నాగ సురేష్‌ – కన్సల్టెంట్‌ న్యూరాలజిస్టు, మెడికవర్ హాస్పిటల్స్‌, కర్నూల్ మాట్లాడుతూ –“స్ట్రోక్‌ వచ్చిన వ్యక్తికి నాలుగు గంటల లోపు సరైన చికిత్స అందిస్తే ప్రాణరక్షణే కాకుండా, పాక్షికంగానైనా పునరుద్ధరణ సాధ్యం అవుతుంది. స్ట్రోక్‌ కి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వు, ధూమపానం, మరియు అలసత్వం. ఈ వ్యాధులను నియంత్రించడం ద్వారా స్ట్రోక్‌ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు,” అని తెలిపారు.డా. వై. రఘు నందిని – కన్సల్టెంట్ న్యూరాలజిస్టు మాట్లాడుతూ,“స్ట్రోక్‌ కి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌, ధూమపానం మరియు ఒత్తిడి. ఈ కారణాలను నియంత్రించడం ద్వారా స్ట్రోక్‌ ముప్పును తగ్గించవచ్చు. ముఖం వంగడం, చేతి లేదా కాలి బలహీనత, మాటల అడ్డంకి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావడం అత్యంత ముఖ్యం,” అని చెప్పారు.డా. టి.వి. సునీల్ యాదవ్‌ – ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టు  మాట్లాడుతూ,“స్ట్రోక్‌ వచ్చిన తరువాత మొదటి గంట ‘గోల్డెన్ అవర్’ గా పిలుస్తారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే రోగి ప్రాణాలు కాపాడటమే కాకుండా మెదడు దెబ్బతినకుండా చేయవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని వెంటనే వైద్య సహాయం పొందాలి,” అని వివరించారు.ఈ కార్యక్రమంలో స్ట్రోక్‌ నుండి కోలుకున్న రోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. వారు తక్షణ వైద్య సహాయం మరియు మెడికోవర్ వైద్య బృందం అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. అలాగే, స్ట్రోక్‌ పేషెంట్లను సమయానికి ఆసుపత్రికి చేర్చిన అంబులెన్స్ డ్రైవర్లకు కృతజ్ఞత సూచక బహుమతులు అందజేశారు.క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ –“స్ట్రోక్‌ పై సమాజంలో అవగాహన పెంచడం అత్యంత అవసరం. స్ట్రోక్‌ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలస్యం కూడా ప్రాణహానికి దారితీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ స్ట్రోక్‌ లక్షణాలను తెలుసుకుని, వెంటనే వైద్య సహాయం పొందాలి. మెడికోవర్ హాస్పిటల్స్‌, కర్నూల్‌లో 24×7 న్యూరో ఎమర్జెన్సీ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి,” అని తెలిపారు.

About Author