టెట్ పై రివ్యూ పిటిషన్ వేసినందుకు ఎస్ టి యు హర్షం
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు : టెట్ పై ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేయడంపై పత్తికొండ ఎస్ టి య హర్షం వ్యక్తం చేసింది. బుధవారం పత్తికొండ ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఎస్ టి యు మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన ఎస్ టి యు మండలస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ కె.సత్యనారాయణ ,కె .నారాయణ ,జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి మరియు మండల ప్రధాన కార్యదర్శి బలరాం, ఆర్థిక కార్యదర్శి మారుతి పాల్గొని మాట్లాడారు . ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ లో తప్పనిసరిగా అర్హత సాధించాలనే అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2011 కు ముందు డీఎస్సీ ల ద్వారా ఎంపికైన ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ,వారి ఆందోళనను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రివ్యూ పిటిషన్ వేయడం చాలా ఆనందకరమైన విషయమని వారు తెలిపారు.వెంటనే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో తుగ్గలి అధ్యక్ష, కార్యదర్శులు సంజీవయ్య,సూరి,మద్దికెర మండల నాయకులు బీరప్ప వెంకట రాముడు, చెన్న కేశవ రావు, కౌలుట్లయ్య,మండ్ల వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

