47 ఏళ్ల తరువాత… అపూర్వ కలయిక…
1 min read
పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్న పూర్వపు విద్యార్థులు
- గురువుల ఆశీర్వాదంతోనే… ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం..
- రిటైర్డు స్పెషల్ కలెక్టరు హుసేన్ సాహెబ్
- ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు, న్యూస్ నేడు: 47 సంవత్సరముల తర్వాత ప్రాతకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు ఆదివారం కర్నూలు నగరంలోని కెఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం డి. హుస్సేన్ సాహెబ్ రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులను కె.శివారెడ్డి కాంట్రాక్టర్, రాయపు .శివారెడ్డి, (రిటైర్డ్) డైరెక్టర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ విభాగం, డి హుస్సేన్ సాహెబ్, (రిటైర్డ్) స్పెషల్ కలెక్టర్, మూర్తి మహేశ్వర్ రెడ్డి వ్యాపారవేత్త, ఆకురాల్పు సుబ్రహ్మణము వ్యాపారవేత్త, ఆర్ శివకుమారయ్య రిటైర్డ్ డివిజనల్ పౌర సంబంధాల అధికారి, తదితరులు కలిసి ఒక వేదిక పైకి తీసుకొని వచ్చినందుకు పూర్వపు విద్యార్థులు వారి సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా (రిటైర్డ్) స్పెషల్ కలెక్టర్ డి.హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతు దాదాపు 47 సంవత్సరాల అనంతరం ఈ రోజు మనందరం ఒక వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మనము ఈ ఉన్నత స్థాయిలో ఉన్నామంటే మన గురువుల ప్రోత్సాహంతో అంచెలు అంచెలుగా ఎదిగి ఈ స్థాయిలో ఉన్నామన్నారు. మనము చదువుకున్న గతంలో సౌకర్యాలు తక్కువ ఉన్న కష్టపడి చదువుకొనామాని ప్రస్తుతం యువత కూడా మమ్ములను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని యువతకు తెలియజేస్తున్నామన్నారు. రాయపు శివారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ విభాగం. మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులే మహనీయూలవుతారు అనే నానుడును దృష్టిలో ఉంచుకొని పట్టుదలతో ఏదైనా సాధించవచ్చును అనుకొని పగిడ్యాల గ్రామం నుండి దాదాపు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రాతకోట లో పదవ తరగతి వరకు చదువుకొని అనంతరం ఉన్నత చదువులను చదువుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి అంచలంచెలుగా పదోన్నతులు పొందుతూ డైరెక్టర్ గా చేరుకొని పదవి విరమణ చేయడం జరిగిందన్నారు. కె.శివారెడ్డి మాట్లాడుతూ దాదాపు 47 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ ఒక వేదికపై కలవడం చాలా ఆనందంగా ఉందని కానీ ఈ సమయంలో మాకు విద్యను బోధించిన ఒక గురువు కూడా అందుబాటులో లేకపోవడం మాకు చాలా విచారకరంగా ఉన్నది మా గురువులను సత్కరించుకోవాలని ఎంతో కుతూహలముగా ఉండేది. కానీ మాకు అదృష్టం లేదు. అయినా ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందదాయకం, మేము చదువుకుండే టైములో తాటిపాడు గ్రామం దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాతకోటకు వెళ్లి చదువుకునే వారం, అలనాటి తీపి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కార్యక్రమం అనంతరం పూర్వపు విద్యార్థులలో రిటైర్డ్ అయిన వారిని, పూర్వపు విద్యార్థుల కలయికకు కృషిచేసిన వారిని కూడా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో 1978 మరియు 1979 సంవత్సరం ప్రాతకోట జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు వీరి వీరిగా పాల్గొన్నారు. అనంతరం విందు భోజనంతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ముగించారు.



