కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్
1 min read

-డాక్టర్స్ డే-2025 సందర్భముగా కర్నూలు లో మెన్స్ ఓపెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ – 2025
కర్నూలు, న్యూస్ నేడు : కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు మరియు ఐఎంఏ, కర్నూలు వారి సౌజన్యంతో ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాయలసీమ వైద్యుల కోసం ప్రత్యేకంగా మెన్స్ ఓపెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – 2025 నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు పాల్గొన్నారు. మొదటి విజేతగా డా. అమరేంద్రనాథ్ రెడ్డి మరియు డా. వాసు రెడ్డి రోలింగ్ ట్రోఫీ గెలుచుకున్నారు. రెండవ విజేతగా డా. ఎడ్విన్ మరియు డా. భరత్, మూడవ విజేతగా డా. సునీల్ కుమార్ రెడ్డి మరియు డా. అనిల్ నిలిచారు. వైద్య విద్యార్థుల క్యాటగరీలో మొదటి విజేతగా (డా). భరత్ మరియు (డా). భార్గవ్ నిలిచారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు సీఓఓ డా. సునీల్ సేపూరి మరియు ఐఎంఏ సెక్రటరీ డా. S. V. రామ్ మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ డా. రామచంద్ర నాయుడు మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఫిట్ గా మారుతారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఆడడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. ఈ టోర్మమెంట్ లో చాలా మంది వైద్యులు పాల్గొన్నారు. నిత్యం డాక్టర్లు రోగులకు వ్యాయామం చేయాలని చెబుతుంటారు. ఈరోజు ఆ వైద్యులే ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం అభినందించాల్సిన విషయం. భవిష్యత్తులో మరిన్ని క్రీడా టోర్మమెంట్ నిర్వహించేందుకు కిమ్స్ హాస్పిటల్స్ కృషి చేస్తుంది.

