NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్య, ఉపాధి నిరుద్యోగం పై పోరాటమే డివైఎఫ్ఐ లక్ష్యం

1 min read

డివైఎఫ్ఐ జిల్లా  కార్యదర్శి నాగేష్

డివైఎఫ్ఐ ప్రాంతీయ నూతన కమిటీ ఎన్నిక

పత్తికొండ , న్యూస్​ నేడు:  విద్య ఉపాధి నిరుద్యోగంపై డివైఎఫ్ఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం ప్రాంతీయ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవనంలో డివైఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు నాయకులు రవిచంద్ర, హాజరయ్యారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్, మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్ట ప్రాంతంలోని స్థానిక సమస్యలతో ప్రతిధ్వనించే ఉద్యమాలను పెంపొందించడంపై డివైఎఫ్ఐ దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పేద మధ్యతరగతి నివసించే ప్రాంతాల్లో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కనీసం సిమెంట్ రోడ్లు కూడా వేయని పరిస్థితులు నెలకొన్నాయని, ధనిక వర్గాలకు చెందిన కాలనీలలో మాత్రమే సిసి రోడ్లను వేసి వాటిని భూతద్దంలో చూపిస్తున్నారని అన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారి కూలీలకు కనీసం ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించకుండా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం తో పాటు వారికి పని దినాలను కూడా చూపించలేని దుర్భర పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి విధానాలు అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్న దుగ్గెన్న, రవి, మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పోరాడడానికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత ముందుండి పోరాటం చేస్తుంది అన్నారు.

About Author